బైరాపూర్‌లో టీబీ ముక్తి కార్యక్రమం.. 100 మందికి ఎక్స్‌రే పరీక్షలు

1001374646.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 18: వెల్దండ మండల పరిధిలోని బైరాపూర్ గ్రామంలో టీబీ ముక్తి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భీమా నాయక్ హాజరయ్యారు. శిబిరంలో సుమారు 100 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ పవన్ నాయక్ టీబీ వ్యాధి లక్షణాలు, దాని వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ రాజు మంజుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి దీప్తి, వీరేష్, చందు, జి. సరిత, రమేష్, ఏఎన్‌ఎం పద్మ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...