రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026
శంకర్పల్లి మండల ప్రజలకు నూతన ప్రభుత్వ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రేపు సెప్టెంబర్ 1న ఉదయం 11 గంటలకు శంకర్పల్లి MPDO కార్యాలయంలో జరగనుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారి చేతుల మీదుగా కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకటరెడ్డి, శంకర్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడపతి చంద్రమౌళి ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరనున్నాయని వారు తెలిపారు.
