ఖమ్మం మహాసభలకు తరలివెళ్లిన ఏఐకేఎంఎస్ శ్రేణులు
- ఖమ్మం మహాసభలకు తరలివెళ్లిన ఏఐకేఎంఎస్ శ్రేణులు - September 28, 2026
- జీపీల అభివృద్ధిపై సమన్వయంతో పని చేయాలి : ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ - September 28, 2026
- ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ? - September 27, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 28: ఖమ్మంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభల బహిరంగ సభకు నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు బూరుగు సత్తయ్య మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, కూలీలకు ఉపాధి, కూలి పెంపు, సాగునీరు, పంటల రక్షణ వంటి సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. ఈ మహాసభలకు దేశంలోని రైతు కూలీ సంఘం నాయకులు హాజరవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. తరలి వెళ్లిన వారిలో జిల్లా కోశాధికారి గజ్జి రవి, నాయకులు కొండి యాదగిరిరెడ్డి, చింతల అంజయ్య, బూరుగు లక్ష్మమ్మ, ఎస్‌కే జాయిదా, పెర్కల్ శారద, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.

