లింగారెడ్డిపల్లిలో లో-వోల్టేజీకి ఫుల్ స్టాప్ – మూడో వైర్ ఏర్పాటు

వెల్దండ మండలం: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సరఫరా సమస్యలను తీర్చేందుకు గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. గ్రామంలో లో-వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో, మూడవ విడత (3rd Wire) విద్యుత్ వైర్ పిట్ చేసే పనులను సోమవారం ప్రారంభించారు.1001339672.jpg

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, వార్డు సభ్యులు ఆకినమోని మల్లేష్ గారు, గ్రామ నాయకులు మల్లేపాకుల శేఖర్, మల్లేపాకుల భాస్కర్, గ్రామ మల్టీ పర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా, అందరికీ నిరంతరాయంగా విద్యుత్ అందేలా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు. కొత్త వైర్ ఏర్పాటుతో వోల్టేజ్ సమస్య పూర్తిగా తొలగిపోతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

You may also like...