వెల్దండ సింగిల్ విండో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ: రాజేందర్ రెడ్డి

1001186112.jpg

వెల్దండ సెప్టెంబర్ 17:తెలంగాణ విమోచన దినం సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) కార్యాలయంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పంతు నాయక్,సీఈఓ శ్రీనివాస్, సిబ్బంది వెంకట్ రెడ్డి, రామకృష్ణ,సాయిబాబా,బిక్షపతి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ జాతీయ గీతం ఆలపించి, భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు.

You may also like...