ఈ నెల 28న అమ్రాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
- తాడూరు మండలంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ - September 25, 2026
- ఈ నెల 28న అమ్రాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక - September 25, 2026
- డిండి చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ - September 25, 2026
అమ్రాబాద్: ఈ నెల 28న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నల్లమల్ల అమ్రాబాద్ కు రానున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.

మన్ననూరులో రూ. 69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
