కల్వకుర్తి కోసం నాడు దీక్ష.. నేడు కోర్టుకు – వంశీచంద్ రెడ్డి

కల్వకుర్తి: కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం 2016లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి నేడు కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు.

1001336468.jpg

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ "కల్వకుర్తి గడ్డ నన్ను ఎంతగా మలిచిందో… ఆ గడ్డ కోసం నిలబడే నా సంకల్పం అంతే బలంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.

"2016లో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నన్ను, దీక్ష 4వ రోజున పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆ పోరాటం నాటి జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు. పదేళ్లు గడిచినా కల్వకుర్తి ప్రజల హక్కు కోసం నిలిచిన ఆ సంకల్పం నేటికీ అదే స్థిరత్వంతో కొనసాగుతోంది" అని వంశీచంద్ రెడ్డి తెలిపారు.ప్రజలతో కలిసి సాగించిన పోరాటాల ఫలితంగానే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పడిందని, కల్వకుర్తి ప్రజల హక్కుల కోసం తన ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

You may also like...