వైన్స్‌లోనే వేటకొడవళ్లతో దారుణ హత్య

హైదరాబాద్‌: నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారులో వెంబడించిన దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని ఓ వైన్స్‌లోకి పరుగెత్తి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడిని వదలని దుండగులు వైన్స్‌లోకి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడిని ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ నయీమ్‌గా…