రిమ్స్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
- రిమ్స్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం - September 22, 2026
- భానురులో కులరక్కసి - September 22, 2026
- సోనియాకు కోర్టు ఝలక్! - September 21, 2026

ఆదిలాబాద్: రిమ్స్ నియోనేటల్ వార్డులో ఏసీ సిలిండర్ పేలిన ఘటనలో శిశువులు మృతి చెందడంపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిన్నారుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆదేశాలు ఇవ్వడం కంటే ముందస్తు పర్యవేక్షణ, భద్రతా చర్యలే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలని కోరారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
