భానురులో కులరక్కసి
- భానురులో కులరక్కసి - September 22, 2026
- సోనియాకు కోర్టు ఝలక్! - September 21, 2026
- ప్రెస్ అకాడమీ చైర్మన్కు ఘన సత్కారం - September 21, 2026
పటాన్చెరు, సెప్టెంబర్ 22: బీడీఎల్ భానురు గ్రామంలో దళిత మహిళ గృహ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎస్సీ వర్గానికి చెందిన చేవెళ్ల స్వరూప తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుండగా, కొందరు వ్యక్తులు కుల వివక్షతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రి తీసుకువచ్చే ట్రాక్టర్లను సీసీ రోడ్డుపై అడ్డంగా నిలిపి, రాకపోకలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఒక దళిత మహిళ తన సొంత స్థలంలో గూడు కట్టుకోవడానికే అడ్డుకట్ట వేయడం సామాజిక వివక్షకు పరాకాష్ట అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను తుంగలో తొక్కుతూ ఎవరైనా కులం పేరుతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించరాదని ఆమె పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, అడ్డంకులకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తన గృహ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు రక్షణ కల్పించాలని స్వరూప డిమాండ్ చేశారు.

