పూణే ఒప్పందానికి నాంది.. అంబేద్కర్ – గాంధీ చారిత్రక భేటీ
- మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి - September 22, 2026
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత - September 22, 2026
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు - September 22, 2026

సెప్టెంబర్ 22 ప్రత్యేకం: 1932 సెప్టెంబర్ 22న పూణేలోని ఎరవాడ జైలులో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీజీ మధ్య జరిగిన చారిత్రక భేటీ పూణే ఒప్పందానికి నాంది పలికింది. కమ్యూనల్ అవార్డు ద్వారా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడాన్ని అంబేడ్కర్ సమర్థించగా, గాంధీజీ దీనిని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.గాంధీజీ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో అంబేడ్కర్‌తో జరిగిన చర్చలు కీలకంగా మారాయి. అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ వంటి అంశాలపై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సంప్రదింపుల అనంతరం 1932 సెప్టెంబర్ 24న పూణే ఒప్పందం కుదిరింది.అణగారిన వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. విభిన్న కులాలు, మతాలు, జాతులతో కూడిన భారతదేశానికి బలమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
