సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత
- మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి - September 22, 2026
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత - September 22, 2026
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు - September 22, 2026

కల్వకుర్తి : సెప్టెంబర్ 22:కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్లోని తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయం సకాలంలో అందేలా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.అనంతరం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో హౌసింగ్ ప్రగతిపై హౌసింగ్ శాఖ అధికారులు, ఏఈలు, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇళ్లు, నిర్మాణ దశలు, పెండింగ్ అంశాలు, అర్హులైన లబ్ధిదారుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ గృహ పథకాల ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈలు హరి, సురేష్, ఎంపీడీవోలు సీత, గీత, సుజాత, సులోచన, జయరాం, విజయలక్ష్మి, శంకర్, మున్సిపల్ కమిషనర్లు మహమూద్, రాఘవేందర్ రెడ్డి, హౌసింగ్ ఏఈలు హరి, సురేష్, కేదార్నాథ్, పల్లవి, శాలిని, చక్రి, పృథ్వీరాజ్, క్రాంతితో పాటు మున్సిపాలిటీల ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
