డిండి ఎత్తిపోతల రద్దు పాదయాత్రకు..ఎల్ హెచ్ పి ఎస్ మద్దతు

కల్వకుర్తి :డిండి ఎత్తిపోతల రద్దు డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు ఉల్పర నుండి కల్వకుర్తికి చేపట్టిన మహా పాదయాత్రకు లంబాడి హక్కుల పోరాట సమితి చారకొండ మండల కమిటీ తరుపున మద్దతు ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవిలాల్ చౌహన్,మండల అధ్యక్షులు రామావత్ సాయికుమార్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, అచ్చంపేట తాలూకా అధ్యక్షులు జుమ్లాల్ ,మండల కార్యదర్శి సరి రామ్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు . సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల ఆదినారాయణ,మాజీ జిల్లా అధ్యక్షుడు పారుపల్లి ప్రభాకర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, మైనార్టీ సెల్…

రేపటి ధర్నా–ర్యాలీని విజయవంతం చేయాలి

జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ సభ్యులు, YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పిలుపు. ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 10:00 గంటలకు నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్…

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27:ఏఐసీసీ పిలుపు మేరకు రేపు (సోమవారం, సెప్టెంబర్ 28) ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ…

గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలు.. ఎస్వి ప్రజా వైద్యశాల లక్ష్యం

వెల్దండ: మండల కేంద్రంలోని పాత ఎస్‌బీఐ బ్యాంకు భవనంలో ఎస్.వీ. ప్రజా వైద్యశాల ఆదివారం ప్రారంభమైంది. ఎన్నమ్స్ అధినేత డాక్టర్ హరికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్నం భూపతిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.అనంతరం ఆసుపత్రి యాజమాన్యం అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన…

కోల్కొంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి కబడ్డీలో ప్రతిభ

70వ ఎస్ జి ఎఫ్  జిల్లా స్థాయి క్రీడల్లో కోల్కొంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి క్రీడల్లో కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం లో ట్రోఫీ సాధించగా, ఖో ఖో,వాలీబాల్ విభాగంలో రన్నరప్ గా ట్రోఫీ సాధించారు. పాఠశాల పిఈటి వీరేందర్ అందించిన ప్రత్యేక శిక్షణ, వల్ల ఈ ట్రోఫీ సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు ఉపాధ్యాయులు, స్థానికులు  పాఠశాల విద్యార్థులకు అభినందనలు  తెలియజేశారు.

అమ్మకు అక్షరమాల పరీక్షలు.. మహిళల బలోపేతమే సమాజానికి పునాది

వెల్దండ: మండలంలోని అన్ని గ్రామాల్లో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు విద్యను అభ్యసిస్తే కుటుంబంతో పాటు సమాజంలోనూ వెలుగులు నింపుతారని అన్నారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు జయమాలిని, సంతోష్‌కుమార్, వార్డు సభ్యులు పురుషోత్తం చారి,…

మూడు నోటీసులు.. అయినా కదలని అధికారులు!

వెంచర్ నిర్వాహకులకు అధికారుల అండదండలు ఉన్నాయా?

మన్సాన్పల్లి శివారులో వ్యవహారంపై కలెక్టర్ జోక్యం కోరుతున్న స్థానికులు

ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు

ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలుప్రముఖ విద్యావంతుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులుపత్రికా ప్రకటన / వార్తా నివేదిక:లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు వివిధ ర రంగాల ప్రముఖులు, విద్యావంతులు మరియు స్నేహితుల సమక్షంలో అత్యంత వేడుకగా, ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో లిటిల్ స్టార్ ప్రధాన ఉపాధ్యాయులు సంజు, వాసవి ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి. రామచందర్, చైతన్య జూనియర్ కళాశాల తెలుగు…

యువ ప్రతిభకు ప్రోత్సాహం.. మరో అరుదైన విజయం

శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారి ప్రోత్సాహం మరియు సహకారంతో యువ పర్వతారోహకుడు విస్లావత్ బన్నీ, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందం హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్-2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే పలు పర్వత శిఖరాలను అధిరోహించిన విస్లావత్ బన్నీ, ఈ ప్రతిష్టాత్మక యాత్రలోనూ తన సాహస ప్రతిభను చాటుకున్నారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారి కలలను సాకారం చేసుకునే క్రమంలో అవసరమైన ప్రోత్సాహం మరియు…