అసంపూర్తి గృహ నిర్మాణాలను ఆదుకున్న ఉప్పల ట్రస్ట్ అధినేత

కల్వకుర్తి : కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మలా ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలో నిలిచిపోయింది.ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకుని ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో నిర్మలా ఇంటికి సిమెంటును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ…

ప్రతినిధి.వికారాబాద్: 500ఏళ్ల చరిత్ర, బుగ్గ రామలింగేశ్వరాలయం!

అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి 500ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి శివలింగం కింద నుంచి ఏడాది పొడవునా సహజ భూగర్భ జలధార ప్రవహిస్తూ కోనేట్లోకి చేరుతుంది. మూసీ నది జన్మస్థాన పరిధిలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికత, ప్రకృతి కలయికకు నిదర్శనం. మహా శివరాత్రికి భక్తులు పోటెత్తే ఈ ఆలయం పర్యాటక దినోత్సవం సందర్భంగా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

నేడు కొల్లాపూర్ నియోజక వర్గానికి కేటీఆర్.. రాక

నాగర్ కర్నూల్ :ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే వీర హర్షవర్ధన్ రెడ్డి తండ్రి స్వర్గీయ బీరం లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెప్టెంబర్ 27 ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు లక్ష్మారెడ్డి దశదినకర్మకు హాజరవుతున్నారని పార్టీ నాయకులు తెలిపారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనగలరని నాయకులు తెలిపారు.

మృతురాలి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం

లింగారెడ్డి పల్లి గ్రామంలో ఐనాల బక్కమ్మ గారు మరణించగా, వారి కుటుంబాన్ని మైల నారాయణ రెడ్డి – మైల రాంరెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.20,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బక్కమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

కాటన్ మిల్లు కార్మికురాలి ఇంటి నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ చేయూత

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మల ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది.ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మల ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటును అందజేశారు.ఈ…

రాష్ట్రస్థాయి రోడ్ సైక్లింగ్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థినిల ఎంపిక

వెల్దండ : ఖేలో ఇండియా రోడ్ సైక్లింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. కే. మమత, పి. హాసిని, కే. అభిత, జీ. నందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు.ఈ నెల 27, 28 తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రోడ్ సైక్లింగ్ పోటీల్లో విద్యార్థినులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీ రవీందర్ అభినందించారు.

అంతారం గ్రామంలో బాలుడు మృతి

షాబాద్ మండలం,అంతారం గ్రామానికి చెందిన జిట్టా చంద్రశేఖర్,తండ్రి లక్ష్మయ్య, వయసు సుమారు 16 సంవత్సరాలు వృత్తి రీత్యా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపానికి గురైనట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ క్రమంలో గ్రామ శివారులోని పంట పొలాల్లో చెట్టుకుఉరి వేసుకొని మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణచివేస్తారా.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వంగూర్: ప్రజా సమస్యలపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ నేత డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జాజాల గ్రామంలో పర్యటించారు.గ్రామ సర్పంచ్ కాశమ్మని కలిసి స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు,అధికారుల వేధింపులపై ఆరా తీశారు.గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్, ఇసుక దందా, భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముఖ్యంగా దుందుబి వాగు పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై విచారించారు.దీనిపై ప్రశ్నిస్తే అధికారులు సరైన సమాధానం…

వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వంగూర్ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంకు సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు….

తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యం.. పోషకాహారమే శ్రీరామరక్ష!

బాన్సువాడ మండలంలోని సొమ్లా నాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప నేతృత్వంలో శనివారం పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మాహ్‌లో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు…