జూపల్లి లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

జూపల్లి: చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ.. భగత్ ఆశయాలను కొనసాగించడమే మనం వారికి ఇచ్చే అసలైన నివాళులని అన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున…

బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా

బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా ​కోస్గి: ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ కోస్గికి చేరుకుంది. ఈ పాదయాత్రలో ప్రముఖ జానపద గాయని ‘రేలారే’ గంగా పాల్గొని తన మద్దతు తెలిపారు. ​తీన్మార్ మల్లన్నకు సోదరి సమానురాలైన రేలారే గంగా ఈ యాత్రలో అడుగులు వేస్తూ, తన గళంతో జానపద గేయాలు పాడుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. తన ఆట పాటలతో పాదయాత్రలో సరికొత్త…

రెడ్ క్రాస్ చైర్మన్ కు జూపల్లి భాస్కరరావు అభినందనలు

నాగర్ కర్నూల్ : మహబూబ్నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జై ప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ కేఎస్ రవికుమార్‌ను ప్రముఖ వ్యాపారవేత్త,బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.తన ఎన్నిక సందర్భంగా జూపల్లి భాస్కర్‌రావు అందించిన సహకారానికి కేఎస్ రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆధ్వర్యంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి…

బ్యాంక్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 28: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వగా, ఆదివారం UFBU ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్...

బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ

నాగర్ కర్నూల్ : పితృవియోగంతో బాధలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శించారు.కొల్లాపూర్ నియోజకవర్గం, సింగోటంలోని బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి తండ్రి దివంగత బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కల్వకుర్తి పట్టణ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?ఓటు హక్కును కాపాడాల్సిన సంస్థే ప్రశ్నార్థకంగా మారడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారంపై సమాధానం చెప్పాలిటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 27 : ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపైనే ప్రశ్నలు తలెత్తడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల…

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా

నాగర్ కర్నూల్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని సెప్టెంబర్ 28న సోమవారం ఉదయం 9:00 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించ బడుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి…

బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి

నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్,సి. లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు…

పాలమూరును కాపాడాలని పాదయాత్ర

కల్వకుర్తి సెప్టెంబర్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి అక్రమంగా 30 టీఎంసీల నీటిని తరలించి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే కుట్రను వ్యతిరేకిస్తూ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి…