జూపల్లి లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

1001218040.jpg

జూపల్లి: చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ.. భగత్ ఆశయాలను కొనసాగించడమే మనం వారికి ఇచ్చే అసలైన నివాళులని అన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like...