ఎమ్మెల్యే కసిరెడ్డి హామీతో కోర్టు కేసు ఉపసంహరణ
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని చిరు వ్యాపారులందరు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీతో కేసును ఉపసంహరించుకున్నారు.బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగం,మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కోర్టు కేసును ఎమ్మెల్యే హామీతో చిరు వ్యాపారులందరూ కలిసి ఉపసంహరించుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు చిరు వ్యాపారులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా…
