పండగల వేళ కమర్షియల్‌ గ్యాస్‌ మంట

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: పండగల సీజన్‌ ప్రారంభమైన వేళ వాణిజ్య రంగంపై ఎల్‌పీజీ ధరల పెంపు అదనపు భారాన్ని మోపింది. అక్టోబర్‌ 1 నుంచి 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌పై...

భవిష్యత్తు యుద్ధాలపై అమెరికా భారీ కసరత్తు

జ్ఞాన తెలంగాణ, : భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం ఎలా మారనుంది? కృత్రిమ మేధ, డ్రోన్లు, రోబోటిక్స్‌, స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థలు, అంతరిక్ష సాంకేతికతల్లో ఎలాంటి మార్పులు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు అమెరికా రక్షణ శాఖ **‘ప్రాజెక్ట్‌ మెరిడియన్‌’**కు శ్రీకారం చుట్టింది. రక్షణ మంత్రి పీట్‌...

లంచం వలలో మొయినాబాద్‌ మున్సిపల్‌ అధికారులు

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ యలమోని సుదర్శన్‌ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి...

22ఏ భూములపై నేడు కేబినెట్‌ కీలక భేటీ

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 22ఏ జాబితాలోని భూముల అంశం కీలకంగా చర్చకు రానుంది. సెక్షన్‌ 22ఏ కింద...

అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌షా

జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అక్టోబర్‌ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేయనున్న డెయిరీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టును సబర్‌ డెయిరీతో అనుసంధానించినట్లు సమాచారం. తూప్రాన్‌లోని...

చలో వెల్దండ ర్యాలీని విజయవంతం చేయాలి.. జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ

వెల్దండ: ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించి, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. అక్టోబర్‌ 11న నిర్వహించనున్న ‘చలో వెల్దండ’ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌–టీఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని మండల, తాలూకా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కేదాస్‌ మోహన్‌ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డాక్టర్‌ అంబేద్కర్‌…

జనగామలో బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ

జనగామ ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సాజిద్, టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, శ్రమదోపిడీకి…

కొట్లలో స్వచ్చ జల ధార..ఆరు తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత

వెల్దండ, సెప్టెంబర్ 30:ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కొట్ర గ్రామంలోని ఆరు తాగునీటి నిల్వ ట్యాంకులను ప్రత్యేక యంత్రాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచారు.ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా మార్చారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం,సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.గ్రామ అవసరాలను గుర్తించి నిరంతరం…

KGBV బాలికలకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ

నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్ తదితర సామగ్రిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థినుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజా పండరి, సర్పంచులు, గ్రామ కాంగ్రెస్…