అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అండగా పోచారం భాస్కర్ రెడ్డి

I

బాన్సువాడ: అంగవైకల్యంతో బాధపడుతున్న యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబాలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు. తన సొంత ఖర్చులతో కృత్రిమ చేయి, కాళ్లు తదితర ఖరీదైన సహాయక పరికరాలను అందించి వారి జీవితాల్లో ఆశ నింపారు. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాభావంతో పనిచేయడం పోచారం కుటుంబంలోనే ఉందన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవే తమ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...