శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు..
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

- సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల సహకారంతో గుండాలను పంపి ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు పార్టీ మారానని చెప్పిన అరికెపూడి గాంధీ, ఫిరాయింపులపై కోర్టు తీర్పు రాగానే బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించినందుకు దాడి చేస్తారా? అని మండిపడ్డారు.
