టమాటా కేజీ రూ.80 – సామాన్యులకు షాక్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

టమాటా కేజీ రూ.80 – సామాన్యులకు షాక్
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:
నిన్న–మొన్నటి వరకు కేజీ రూ.20 నుంచి రూ.40కి లభించిన టమాటా ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ప్రస్తుతం మార్కెట్లలో టమాటా కిలో ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు.
కొన్ని మార్కెట్లలో టమాటా సరుకు కూడా సరిగ్గా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అధిక ధర కారణంగా వ్యాపారులే కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో సరఫరా మరింత తగ్గిపోయింది. మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు భారీగా దెబ్బతినడం, సాగుభూముల్లో నీరు నిల్వ ఉండటం వంటి అంశాలే టమాటా ధర పెరుగుదలకు కారణమని మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
—,
