రేవంత్ రెడ్డి కొంపకు చేరిన కాంగ్రెస్ అసమ్మతి నాయకుల కొట్లాట
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన సెగలు.
హైదరాబాద్ నవంబర్ 07:తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్త సెగలతో రగిలిపోతున్నారు.
తాజాగా ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టారు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు ఇవ్వడంతో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు భగ్గుమన్నారు.
ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు యత్నించారు టికెట్ కాట శ్రీనివాస్ గౌడ్‌కు ఇవ్వాలని పెద్ద ఆందోళనకు దిగారు.
రేవంత్ రెడ్డి డబ్బులకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాట శ్రీనివాస్ గౌడ్ అభిమానులు అనుచరులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటివద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
టికెట్ దక్కని ఆశవహుల ఆందోళనలను నిన్నటి వరకు గాందీభవన్ వరకే పరిమితం ఇవాళ ఏకంగా పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకే చేరుకోవడంతో ఉద్ధృతద వాతావరణం నెలకొంది.
