స్థానిక ఎన్నికల అభ్యర్థులకు ఊరట – కొత్త బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

స్థానిక ఎన్నికల అభ్యర్థులకు ఊరట – కొత్త బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 28 :
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డ్ సభ్యుల అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది. నామినేషన్ కోసం తప్పనిసరి అని ఉన్న కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలనే నిబంధనను ఎన్నికల సంఘం సడలించింది.
అభ్యర్థి వద్ద ఇప్పటికే ఉన్న పాత బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు మూడు నెలల లావాదేవీల స్టేట్‌మెంట్ జతచేస్తే సరిపోతుందని ఎన్నికల సంఘం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో అభ్యర్థులు కొత్త అకౌంట్ తెరవడానికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా, నామినేషన్ ప్రక్రియ మరింత సులభతరమైంది.
