రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

శంకర్‌పల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రేపటి నుండి అధికారికంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ కొత్త బ్యాంక్ ఖాతా వివరాలను డిసెంబర్ 5వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఈ ఖాతాలను పోస్ట్ ఆఫీస్, గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంక్ సహా ఏ గుర్తింపు పొందిన బ్యాంకులోనైనా ప్రారంభించవచ్చని స్పష్టంచేశారు.
ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ఆయా క్లస్టర్లకు కేటాయించిన రిటర్నింగ్ ఆఫీసర్లు (పీఠాధికారులు) మరియు పంచాయతీ సెక్రటరీలకు అప్పగించబడినట్లు చెప్పారు. అభ్యర్థులకు అవసరమైన క్యాష్ సర్టిఫికెట్లు రేపు తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య, స్పెషల్ ఆఫీసర్ ఎమ్మార్వో, మోకిలా సీఐ, శంకర్‌పల్లి సీఐ, ఎంపీవో, ఆర్ఓ, ఏఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగేందుకు సమగ్ర ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
