తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ షెడ్యూల్ ఇదే..
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
TS Inter Supply Exam Schedule 2024: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ షెడ్యూల్ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

హైదరాబాద్, ఏప్రిల్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు హెడ్యూల్ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి.
మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు ఏప్రిల్ 25 నుంచి అంటే రేపట్నుంచి ఫీజు చెల్లించాలి. మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.
రేపట్నుంచే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు కూడా ఫీజు చెల్లింపులు
ఇంటర్ సమాధాన పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు కూడా రేపట్నుంచే ఫీజు చెల్లింపులు చేయవచ్చు. ఫీజులను కేవలం ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి.రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, కాపీ కమ్ రీ వెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 ఫీజుగా చెల్లించాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 25 నుంచి మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అనుమతించింది.
కాగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలకు కలిపి అమ్మాయిలు పైచేయి సాధించారు. ఈ సంవత్సరం రెండు యేళ్లకు కలిపి మొత్తం 69.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఈ ఏడాది మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో మొత్తం 8,31,858 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
