రాజమండ్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది.
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రాజమండ్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు.
చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని.. కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని.. ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే చంద్రబాబుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. కంటి ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు.
అయితే అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం రోజు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించారు…
