రాచూరు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

1001408619.jpg

వెల్దండ,నవంబర్ 28: రాచూరు గ్రామ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ గ్రామ వార్డు సభ్యులు, నాయకులు శనివారం హైదరాబాద్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాచూరు – వెల్దండ బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, నూతన అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లేష్, వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, కొంగల్ల శంకర్, దుబ్బ రామార్జున్, గుత్తి చంద్రశేఖర్, గోకమల్ల ప్రేమ్ కుమార్, పడకంటి వెంకటేష్, నాయకులు మాడ్గుల జయరాం, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...