పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఇద్దరు లబ్ధిదారులకు రూ.87,500 ఆర్థిక సాయం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ఇద్దరికి శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు. జగద్గిరిగుట్టకు చెందిన ఎరువు అశోక్ రెడ్డికి రూ.60 వేలు, కుత్బుల్లాపూర్‌కు చెందిన ఏ. శరణప్పకు రూ.27,500 అందజేశారు. పేదల వైద్య అవసరాలకు CMRF ఎంతో ఉపయోగకరమని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హన్మంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...