రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) *అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం*..
*రక్తదాన సేవలో మరోసారి మానవత్వం చాటిన ముదాం శ్రీధర్ పటేల్*
*రక్తదాతల సేవా సమితి*
నిర్వాహకులు
*బోనగిరి శివకుమార్*
కామారెడ్డి జిల్లా పాతరాజంపేట గ్రామానికి చెందిన *చీదురా సుగుణ* అనే మహిళకీ కిడ్నీ సంబంధిత వ్యాధితో *గజ్వేల్ దగ్గర గల ఒంటిమామిడిలోని RVM ఆసుపత్రి* లో ఆపరేషన్ నిమిత్తం *AB పాజిటివ్* రక్తం అత్యవసరంకాగ వారి కుటుంబ సభ్యులు ముదాం శ్రీధర్ గారినీ సంప్రదించారు.
విషయం తెలుసుకున్న ముదాం శ్రీధర్ పటేల్ వెంటనే స్పందించి రక్తదానం చేసి రోగికి అండగా నిలిచారు. అత్యవసర సమయంలో సమయాన్ని, దూరాన్ని లెక్కచేయకుండా అర్ధరాత్రి స్పందించి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీధర్ పటేల్ ను రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు *బోనగిరి శివ కుమార్*, సేవా సమితి ప్రతినిధి దేవరాములు,పేషంట్ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
*అర్థరాత్రి అయినా, ఎప్పుడు రక్తం అవసరమైనా స్పందిస్తూ రక్తదానం చేయడమే కాకుండా, రక్తదాతలను అందుబాటులోకి తీసుకువస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్న ముదాం శ్రీధర్ పటేల్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
*రక్తదానం అనేది కేవలం దానం కాదు.. ఒక కుటుంబానికి కన్నీళ్లు తుడిచి, మరో కుటుంబంలో ఆనందాన్ని నింపే ప్రాణదానం. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని మరింత పెంపొందిస్తాయని పలువురు ముదాం శ్రీధర్ పటేల్ ను కొనియాడారు*