ఏంల్ఏ అండగా

Dubbaka Srinivas
Latest posts by Dubbaka Srinivas (see all)

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మార్లు సునీత గారికి ₹2,50,000 ఆర్థిక సహాయం
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, అవసరమైన వేళల్లో వెంటనే స్పందించే నాయకత్వం ఎలా ఉండాలో మరోసారి నిరూపించారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి టౌన్ , న్యూ ఆబాదికి చెందిన మార్లు సునీత గారికి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. సాధారణ కుటుంబానికి చెందిన మార్లు సునీత గారి కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఆందోళనలో పడింది. కుటుంబ సభ్యులు ఆశ్రయించడానికి మార్గం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని సంప్రదించారు.
విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, ఆలస్యం చేయకుండా ₹2,50,000 రూపాయల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయం చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం అందడంతో మార్లు సునీత చికిత్సకు మార్గం సుగమమైంది.
“ఇలాంటి క్లిష్ట సమయంలో మా కుటుంబానికి దేవుడిలా నిలిచారు” అంటూ మార్లు సునీత గారి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారి తక్షణ స్పందనను ప్రశంసించారు.
ప్రజా సేవనే ధ్యేయంగా తీసుకుని, ప్రతి కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సేవా భావం నియోజకవర్గంలో విశేషంగా చర్చనీయాంశమైంది.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...