తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
- రాజ్యాంగ పరిరక్షణ సమరభేరి.. హైదరాబాద్‌కు జనగామ కాంగ్రెస్ సేవాదళ్ శ్రేణుల తరలింపు - November 27, 2026
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - November 27, 2026
- భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి - November 27, 2026

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘రైజింగ్ టుగెదర్’ నినాదంతో మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పనుంది.దేశంలోనే అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్పోగా నిర్వహించనున్న ఈ సదస్సులో రక్షా ఎక్స్పో–2026, క్లైమేట్ చేంజ్ కాన్క్లేవ్, స్టార్టప్ షోకేస్, ఎడ్యుకేషన్ కాన్క్లేవ్, ఇండియా జాయ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. రక్షణ, పర్యావరణం, విద్య, స్టార్టప్‌లు, వినోద రంగాల్లోని నూతన అవకాశాలు, ఆవిష్కరణలను ఈ ప్రదర్శనల ద్వారా పరిచయం చేయనున్నారు.హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) కేంద్రంగా, వ్యాక్సిన్ ఉత్పత్తిలో కీలక కేంద్రంగా, ఏరోస్పేస్, తయారీ రంగాలకు ప్రధాన గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్, సెమీకండక్టర్లు, డ్రోన్లు, జెట్ ఇంజిన్లు, రక్షణ రంగ సాంకేతికత వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.అదేవిధంగా తెలంగాణ గిరిజన సంస్కృతి, ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విశిష్టతను కూడా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.రైజింగ్ టుగెదర్’ స్ఫూర్తితో నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలిపే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.
