అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
- అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం - November 27, 2026
- పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవాలి - November 25, 2026
- ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్ - November 25, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 26 : మండలంలోని కల్మెర, బొల్లెపల్లి, ఎరసానిగూడెం గ్రామాల్లో గురువారం 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ సరోవర్ చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలను చేపట్టడంతో పాటు స్వచ్చంద శ్రమదానం చేశారు. ఉపాధి కూలీలకు ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే అంశాలపై అవగాహన కల్పించి, రాజ్యాంగ ప్రవేశికలోని ప్రాథమిక సూత్రాలు, హక్కులు, బాధ్యతల గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఎపీఓ కడెం రాంమోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కార్డు అందిస్తామని తెలిపారు. ఎల్ నినో ప్రభా వంతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మండలంలోని పేద, నిరుపేద మధ్య తరగతి కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధి పనులు పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఈసీ శ్రీదర్, పంచాయితీ కార్యదర్శులు సరస్వతి, ప్రసన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
