అచ్చంపేటలో భూమిపూజకు వెల్దండ నుంచి భారీగా బయలుదేరిన గిరిజన శ్రేణులు

1001401008.jpg

వెల్దండ,నవంబర్ 26:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో వెల్దండ మండల గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.మండలం నుంచి గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులు బయలుదేరిన బస్సును వెల్దండ సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన శ్రేణులు కార్యక్రమానికి బయలుదేరాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం గిరిజన సమాజానికి ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఆలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.38 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మిగతా నిధులను విడతలవారీగా విడుదల చేసి ఆలయ అభివృద్ధి చేపట్టనున్నట్లు వివరించారు.మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని 20 ఎకరాల స్థలంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయం, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను కలిపి ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.గిరిజనుల అభివృద్ధితో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన నాయకుడు శంకర్ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు శంకర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, నర్సింగ్ నాయక్, రఘుపతి నాయక్‌తో పాటు పలువురు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You may also like...