రాజ్యాంగ విద్య తప్పనిసరి చేయాలి: గురుకుల ఉపాధ్యాయుడు జి. శివ కిషోర్

జ్ఞాన తెలంగాణ, నవంబర్ 26: విద్యార్థులకు వృత్తి విద్యతో పాటు పౌర బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించేందుకు భారత రాజ్యాంగ విద్యను అన్ని విద్యా స్థాయిల్లో తప్పనిసరి చేయాలని ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఉపాధ్యాయుడు జి. శివ కిషోర్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, వైద్య, ఫార్మసీ, సైన్స్ తదితర కోర్సుల్లోనూ రాజ్యాంగ విద్యను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ప్రాథమిక హక్కులు, పౌర విధులు, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషిని యువత తెలుసుకోవాలని పేర్కొన్నారు. కేవలం వృత్తి నైపుణ్యాలు కలిగిన వారిగానే కాకుండా బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులు ఎదగాలని, రాజ్యాంగాన్ని చదివే వారే కాకుండా దాని విలువలను ఆచరించే యువతరం దేశానికి అవసరమని జి. శివ కిషోర్ అన్నారు.

You may also like...