అడవి పంది దాడిలో గాయపడిన గీత కార్మికుడికి పరామర్శ
- ఆడబిడ్డ వివాహానికి సర్పంచ్ రూ.10 వేల ఆర్థిక సహాయం - November 25, 2026
- చంద్రాయన్పల్లి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం - November 25, 2026
- అడవి పంది దాడిలో గాయపడిన గీత కార్మికుడికి పరామర్శ - November 25, 2026

వెల్దండ నవంబర్ 25: మండలంలోని బండోనిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు సత్తూరి జంగయ్య గౌడ్ అడవి పంది దాడిలో గాయపడగా, వెల్దండ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మట్ట మదన్ గౌడ్ వెల్దండలోని ఎన్నం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా జంగయ్య గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు మట్ట విష్ణు గౌడ్ పాల్గొన్నారు.
