పేదల కళ్ళలో వెలుగులు నింపుతున్న మానవతా మూర్తి.. సుంకి రెడ్డి.!
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026

కడ్తాల్, సెప్టెంబర్ 17: కడ్తాల్ గడ్ పై డబ్బులేక కంటి చూపు కోల్పోయి చీకట్లో మగ్గుతున్న పేదలకు దేవుడిలా అండగా నిలుస్తున్నారు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.ఎంబీఏ గార్డెన్స్ లో ప్రపంచ ప్రఖ్యాత శంకర నేత్రాలయ, చెన్నై వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం నేడు 7వ రోజుకు చేరుకుంది.ఈ శిబిరానికి ఇప్పటివరకు 5,500 మందికి పైగా హాజరయ్యారు. అందులో 3,600 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, 2,422 మందికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు.కంటి శుక్లాలతో బాధపడుతున్న 168 మందికి ఆపరేషన్లకుగుర్తించారు.సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఆపరేషన్లు 19వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని, సుంకిరెడ్డి సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తల్లోజు రఘు, ఎగిరిశెట్టి లింగం,రచ్చ శ్రీరాములు, నరేందర్ గౌడ్, జగన్, రమేష్ యాదవ్, కొండల్ యాదవ్, శ్రీపతి, శేఖర్, నాగిళ్ళ శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
