దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు.. డిసెంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోండి!

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి: జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రూప్‌-4 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామటి, వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ నెల 25 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో కామారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (DWO) కార్యాలయంలోని రూమ్ నంబర్ 31లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హులైన దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.

You may also like...