ప్రయాణ ప్రియులకు సదరన్ ట్రావెల్స్ ‘హంగామా సేల్–2026’.. టూర్ ప్యాకేజీలపై ప్రత్యేక ఆఫర్లు
ప్రయాణ ప్రియులకు ఆకర్షణీయమైన అవకాశాలను అందిస్తూ ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ వార్షిక ‘ట్రావెల్ హంగామా సేల్–2026’ను ప్రారంభించింది. 2026 సంవత్సరాంతంతో పాటు 2027 వేసవి సెలవుల ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని దేశీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై ప్రత్యేక డిస్కౌంట్లు, వివిధ ప్రయోజనాలతో కూడిన ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 25 నుంచి ప్రారంభమైన ఈ సేల్‌లో ప్రయాణికులు ముందస్తు బుకింగ్‌ల ద్వారా తమకు అనుకూలమైన ప్రయాణ తేదీలను ఎంపిక చేసుకుని ప్రత్యేక రాయితీలను పొందే అవకాశం కల్పిస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ అలపాటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అలపాటి మాట్లాడుతూ, ప్రయాణికులు ముందస్తుగా తమ పర్యటనలను ప్రణాళిక చేసుకుని బుక్ చేసుకోవడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. దేశీయ టూర్ ప్యాకేజీలను రూ.5,000 టోకెన్ అమౌంట్‌తో, అంతర్జాతీయ పర్యటనలను రూ.10,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 2027 వరకు ప్రయాణాలకు ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రయాణికుల ఆర్థిక సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ లేని EMI సదుపాయంతో ‘ట్రావెల్ నౌ, పే లేటర్’ అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, వియత్నాం వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలతో పాటు కాశ్మీర్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, చార్ధామ్, అయోధ్య, వారణాసి వంటి దేశీయ పర్యాటక గమ్యస్థానాలకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది.
సదరన్ ట్రావెల్స్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు 2,500కు పైగా గ్రూప్, కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని, 300 మందికి పైగా ట్రావెల్ నిపుణులతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. కుటుంబ విహారాలు, స్నేహితుల పర్యటనలు, గ్రూప్ టూర్లు, వ్యక్తిగత ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా ప్యాకేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సేల్ ద్వారా 2026, 2027 సంవత్సరాల్లో తమకు అనుకూలమైన తేదీల్లో పర్యటనలను ముందుగానే బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. మరిన్ని వివరాల కోసం www.southerntravels.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
