ప్రతిపక్షం లేదంటారా.. ఎమ్మెల్యే కసిరెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి కౌంటర్.

1001395614.jpg

వెల్దండ నవంబర్ 24 : కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్షమే లేదంటూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెల్దండ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ఖండించారు. వెల్దండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులు కాకుండా సింగిల్ విండో ఎన్నికలు నిర్వహిస్తే అధికార, ప్రతిపక్షాల బలమెంతో తెలిసేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ప్రభుత్వంలో అమలైన పథకాలన్నీ కొనసాగిస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే, కేసీఆర్ కిట్, దళితబంధు, రైతుబంధు పరిస్థితిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల పెంపు వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఆరు గ్యారంటీల అమలు, రైతులకు అందుతున్న సహాయం, ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వ చర్యల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో పేరుతో కాలయాపన చేయడం సరికాదని రాంరెడ్డి అన్నారు.

You may also like...