జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
- జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం - November 23, 2026
- రాచకొండ రాములు చిత్రపటానికి రియల్ ఎస్టేట్ యూనియన్ నాయకుల నివాళులు - November 23, 2026
- పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు - November 23, 2026
జనగామ పీజీ కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా జనగామ జిల్లాకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంతో పాటు, జనగామ పీజీ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు.సోమవారం వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ రామచంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ను ఘనంగా సన్మానించారు.జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని, పీజీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. పీజీ కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కళాశాల నిర్మాణ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన ఐదు శాతం పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.జనగామలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, కళాశాల మంజూరైతే నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని, జనగామ జిల్లా విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.దీనిపై స్పందించిన రిజిస్ట్రార్ రామచంద్రం ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే జనగామ పీజీ కళాశాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలిస్తానని తెలిపారు.
