అడవి పంది దాడిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
- అడవి పంది దాడిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు - November 22, 2026
- గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: శంకర్ నాయక్ - November 22, 2026
- పేదల సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం.. సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 22, 2026

వెల్దండ నవంబర్ 22: వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామానికి చెందిన సత్తూరి జంగయ్య గౌడ్ అనే గీత కార్మికుడు అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జంగయ్య గౌడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కల్లు గీసేందుకు వెళ్లాడు.అదే సమయంలో ఓ అడవి పందిని గమనించిన కుక్కలు దానిని వెంబడించడంతో,ఒక్కసారిగా అడవి పంది జంగయ్య గౌడ్‌పై దాడి చేసింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు కర్రలతో అడవి పందిని తరిమివేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన జంగయ్య గౌడ్‌ను 108 అంబులెన్స్‌లో వెల్దండ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు.
