మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత
- అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేరు - October 1, 2026
- కల్వకుర్తిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమి పూజ - October 1, 2026
- మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత - October 1, 2026

వెల్దండ :వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సమకూర్చిన రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.అలాగే మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ రూ.2 వేలు, మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య రూ.2 వేలు, బీఆర్ఎస్ నాయకుడు తాజుద్దీన్ రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకిషన్, గుత్తి జంగయ్య, గోకమల్ల రాజు, వార్డు సభ్యుడు రమేష్ ముదిరాజ్, రామార్జున్‌తో పాటు గ్రామస్థులు వెంకటేష్, కృష్ణయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
