చెదురుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
- ప్రమాదంలో గాయపడిన లాలూ నాయక్‌కు భూపతిరెడ్డి పరామర్శ - November 21, 2026
- ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య - November 21, 2026
- చెదురుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - November 21, 2026

వెల్దండ నవంబర్ 21 : మండల పరిధిలోని చెదురుపల్లి గ్రామంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ వడ్త్యావత్ ధన్సింగ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెరుగు సహదేవ్ యాదవ్, గ్రామ కార్యదర్శి అన్నపూర్ణ, సింగిల్ విండో డైరెక్టర్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొమ్ము అంజయ్య, మురళి నాయక్, వార్డు సభ్యులు దేవేందర్ నాయక్, తగుళ్ల బుచ్చయ్య యాదవ్, కొండ్రెడ్డి పద్మ, మద్రాసు లక్ష్మమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలే రామాంజయ్య, కొండ్రెటి రామస్వామి, గ్రామస్తులు కొమ్ము వెంకటయ్య, కొమ్ము ప్రవీణ్, బుగ్గకాల్వ తండా ప్రజలు పాల్గొన్నారు.
