పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS బుధవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, ఆవరణ పరిశుభ్రత, పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, NDPS కేసులకు సంబంధించి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సైబర్ నేరగాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దొంగతనాల కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, నమోదైన కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించి నిందితులను త్వరితగతిన గుర్తించి కేసులను ఛేదించాలని స్పష్టం చేశారు.అలాగే CCTNS మరియు ఇతర ఆన్‌లైన్ పోలీస్ వ్యవస్థలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని, విధుల పట్ల పూర్తి బాధ్యత, క్రమశిక్షణ పాటించాలని తెలిపారు. 
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సమగ్రంగా పరిశీలించి చట్టపరిధిలో సత్వర పరిష్కారం అందించాలని, ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, పరిగి సీఐ కొండల్ రెడ్డి, పరిగి ఎస్‌ఐ మోహన కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...