ఘనంగా మోమిన్ పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం
- ఘనంగా మోమిన్ పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం - September 25, 2026
- మోమిన్ పేట్ పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్ నరోత్తంరెడ్డి బాధ్యతలు - September 25, 2026
- ఘనంగా మోమిన్ పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం - September 25, 2026
వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా ఎన్ . నరోత్తం రెడ్డి గారు , వైస్ ఛైర్మన్ గా మల్లారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన పిఎసి ఎస్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తానని సొసైటీ ద్వారా రైతులకు సకాలంలో ఋణాలు, ఎరువులు , విత్తనాలు అందేలా చూస్తానని మరియు పిఎసి ఎస్ ను ఆదర్శంగా దిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య రాజకీయ నాయకులు, సహకార సంఘం అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు హాజరై నూతన చైర్మన్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు
