పరిగి పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS బుధవారం పరిగి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, ఆవరణ పరిశుభ్రత, పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, NDPS కేసులకు సంబంధించి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర…
