రోడ్డు ప్రమాద బాధిత జర్నలిస్టుకు మిత్ర ఫౌండేషన్ ఆర్థిక సాయం
- అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత - October 30, 2026
- ఎనిమిదేళ్ల తర్వాత గౌరారానికి ఆర్టీసీ బస్సు.. విద్యార్థుల హర్షం - October 30, 2026
- చలో ఢిల్లీ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా.. తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు - October 30, 2026
కల్వకుర్తి అక్టోబర్ 30:కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన జర్నలిస్టు, డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్ బైక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు.ప్రమాదంలో ఆయన కాలికి,తలకు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఆయన చికిత్స నిమిత్తం ఫౌండేషన్ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ కుడుములు చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షుడు కాకుడాల శ్రీకాంత్ నేత, రావూఫ్, శ్రీకాంత్ గౌడ్, నాదిరి తరుణ్, దేవర్ల మహేష్, జిలాని తదితరులు పాల్గొన్నారు.
