ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి
- ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి - October 29, 2026
- ఘనంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రహీత ఎన్ నర్సింహా రెడ్డి గారి జన్మ దిన వేడుకలు - October 27, 2026
- ఎర్ర మట్టి దుమ్ముతో గులాబీ పంటకు తీవ్ర నష్టం - October 25, 2026
మోమిన్ పేట్ మండల పరిధిలో బాల్ రెడ్డి గూడ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది. బ్యాంక్ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి. ఋణాలు తీసుకున్న రైతులు , డ్వాక్రా సంఘాలు సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు . నేటి ఆధునిక మరియు అనిశ్చిత జీవితంలో ప్రతి ఒక్కరూ బీమా పాలసీ చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబం రోడ్డున పడకుండా కాపాడే ఒకే ఒక రక్షణ కవచం బీమాపథకం. ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ లో భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, గ్రామ సర్పంచ్,గ్రామస్తులు, మహిళ సంఘాలు పాల్గొన్నారు.

