చీమలదరి: వేలం పాటలో రూ .5.01 లక్షల లడ్డు కైవసం చేసుకున్న లెవెన్ టీమ్ సభ్యులు
- చీమలదరి: వేలం పాటలో రూ .5.01 లక్షల లడ్డు కైవసం చేసుకున్న లెవెన్ టీమ్ సభ్యులు - September 26, 2026
- దేవరంపల్లిలో గణేష్ ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ - September 25, 2026
మోమిన్ పేట్ మండలకేంద్రం చీమలదరి గ్రామంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా హనుమాన్ ఆలయంలో 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాధుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలం పాట హోరా హోరీగా సాగింది. గ్రామానికి చెందిన ప్రముఖులు పోటి పడగ ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన వేలం పాటలో లెవెన్ టీమ్ సభ్యులు ఐదు లక్షలకు ఒక రూపాయి కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహ పూరిత వాతావరణం లో జరిగిన ఈ శోభ యాత్ర నిమజ్జన కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.
