సెంట్రలైజ్డ్ కిచెన్ రద్దు చేయాలి.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
- సెంట్రలైజ్డ్ కిచెన్ రద్దు చేయాలి.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి - October 28, 2026
- నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోండి సత్యనారాయణ గౌడ్ - October 28, 2026
- నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన - October 27, 2026
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి, మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను వంట కార్మికులకే అప్పగించాలని రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2023–24 సంవత్సరాలకు సంబంధించిన అల్పాహార బకాయిలతో పాటు, జూన్, జూలై, ఆగస్టు నెలల పెండింగ్ వంట బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. వంట కార్మికులకు నెలకు రూ.10 వేల పారితోషికం చెల్లించాలని, గ్యాస్, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థికి రూ.25 మెస్ చార్జీ చెల్లించి, కార్మికులకు గుర్తింపు కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రాజకీయ కారణాలతో కార్మికులను విధుల నుంచి తొలగించరాదని పేర్కొంటూ, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
